హైదరాబాద్: తెలంగాణలో తాజా పరిణామాల నేపథ్యంలో సీఎస్ తో విపక్షనేతలు బీఆర్ కే భవన్ లో భేటీ అయినారు. ముఖ్యంగా కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వలన ప్రజా సమస్యలపై చర్చించనున్నారు. లాక్ డౌన్ లో రైతుల ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నారు.
పేదలకు నిత్యావసరలాల పంపిణీలో అలసత్వం, ప్రభుత్వ ఆర్థిక సాయం పంపిణీలో సమస్యలను వివరించనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్.రమణ, చాడ వెంకట్ రెడ్డి తదితరులు హాజరైనారు.