FbTelugu

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తామన్న ప్రతిపక్షాలు

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తొలిరోజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగాన్ని బహిష్కరిస్తామని ప్రతిపక్షాలు హెచ్చరించాయి. ఈ మేరకు 16 ప్రతిపక్ష పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

ఈ నెల 29వ తేదీ నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. సమావేశాలో తొలిరోజు రాష్ట్రపతి ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ తో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు 16 పార్టీలు తెలిపాయి. దీనిపై కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు లేకుండానే కొత్త వ్యవసాయ చట్టాలను బీజేపీ ప్రభుత్వం ఆమోదించిందన్నారు. బహిష్కరణలో పాల్గొంటున్న పార్టీల్లో ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, డీఎంకే, శివసేన, టీఎంసీ, సమాజ్ వాదీ, ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, కేరళ కాంగ్రెస్ (ఎం), ముస్లిం లీగ్, ఏఐయూడీఎఫ్ ఆర్ఎస్పీ, పీడీపీ, ఎండీఎంకే ఉన్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు లేవు.

You might also like

Leave A Reply

Your email address will not be published.