FbTelugu

విద్యుత్ చార్జీలపై వారిది అసత్యప్రచారం: దేవినేని అవినాష్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ చార్జీలు పెంచారంటూ.. ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని వైసీపీ విజయవాడ (తూర్పు) ఇంచార్జి దేవినేని అవినాష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో విద్యుత్ చార్జీలు ఏమీ పెంచలేదని తెలిపారు.

లాక్ డౌన్ నేపథ్యంలో రెండు నెలలకు సంబంధించిన బిల్లులు విడివిడి ఇచ్చినట్టు తెలిపారు. అయితే వేసవి, లాక్ డౌన్ కారణంగా విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లవరకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నట్టు తెలిపారు. 500 యూనిట్లకంటే అదనంగా యూనిట్లు వాడిన వారికే యూనిట్ కు 90 పైసలు అదనంగా పడిందని తెలిపారు.

You might also like