FbTelugu

ఆపరేషన్ సక్సెస్… బయటపడ్డ ఆరుగురు!

చిత్తూరు: నిరంతర పర్యవేక్షణ, వరద ఉధృతి లేకపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడగలిగారు. నివర్ తుఫాన్ కారణంగా 24 గంటలుగా వారు బిక్కుబిక్కుమంటూ గడిపారు.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పీలేరు పట్టణ శివారు ప్రాంతం, దొడ్డిపల్లి గ్రామం ఆకులవారి పల్లి దగ్గర, ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు కూలీ పనులు చేసుకొంటూ జీవిస్తున్నారు. నివాసం ఉండడానికి ఇల్లు లేక, గార్గేయనది, మధ్యలో చిన్న గుట్ట లాగా ఉండడంతో అక్కడే కోటం లాగా ఏర్పరచుకొని ఉంటున్నారు. రోజు కూలీ పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తూ ఉండే వారు. నివర్ తుఫాన్ కారణంగా గుట్టకు ఇరువైపులా గార్గేయ నది ప్రవహిస్తూ ఉండడంతో బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. 24 గంటలుగా వారు అక్కడే ఉండిపోయారు.

గురువారం సాయంత్రం7గంటల ప్రాంతంలో అంచనాలకు మించి ప్రవహిస్తుండడం తో కాపాడండి అంటూ కేకలు వేశారు. ఈ విషయం తెలియడంతో  అధికారులు రాత్రి 9గంటలకు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వారికి ఆహారం అందించే కాపాడే యత్నం చేశారు.  ఇటు వైపు క్రేన్, అటువైపు చెట్టు మధ్య ఒక తాడు కట్టారు. ఆ తాడు సహాయంతో నది మధ్యలో ఉన్నవారిని ఒడ్డుకు చేర్చడంతో ఆరుగురు ప్రాణాలు దక్కాయి. స్థానికులు పోలీసులను, రెస్క్యూ సిబ్బందిని అభినందించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.