FbTelugu

ఆపరేషన్ చిరుత

హైదరాబాద్: బుద్వేలు రైల్వే స్టేషన్ పక్కనున్న ఖాళీ స్థలంలో చిరుత దాక్కున్నట్లు సమాచారం అందడంతో అక్కడికి అటవీ, పోలీసు అధికారులు చేరుకున్నారు.

ఇవాళ ఉదయం కాటెదాన్ బ్రిడ్జీ సమీపంలో కన్పించిన చిరుత, ఆ తరువాత అక్కడి నుంచి వెల్లిపోయిన విషయం తెలిసిందే. అయితే బుద్వేల్ ప్రాంతంలో చిరుతను బంధించేందుకు అటవీ సిబ్బంది సిద్దంగా ఉన్నారు. చిరుత ఉన్న ప్రదేశంలో దట్టమైన చెట్లు, పొదలు గుప్పుగా ఉండడంతో లోనికి వెళ్లలేకపోతున్నారు. పరిసర కాలనీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. దాన్ని బంధించేందుకు గ్రేహౌండ్స్ సిబ్బందిని రప్పించారు. డ్రోన్ కెమరాలను కూడా సిద్ధం చేశారు.

ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటుందని, ఈ సమయంలో దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తే లేనిపోని సమస్యలొస్తాయంటున్నారు. డ్రోన్ కెమెరాలను వినియోగిస్తే ఆ శబ్ధానికి లేని సమస్య సృష్టించినవాళ్లమవుతామనే ఉద్దేశంతో అధికారులు అక్కడే కాపుకాసుకుని ఉన్నారు.

విశ్రాంతి తరువాత అది అటూ ఇటూ తిరుగుతుందని, ఆ సమయంలో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అదుపులోకి తీసుకుంటామని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఉదయం 8.00 గంటల నుంచి కాటేదాన్, బుద్వేల్, రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

 

 

You might also like

Leave A Reply

Your email address will not be published.