FbTelugu

ఢిల్లీలో అతిపెద్ది కోవిడ్ హాస్పిటల్ ప్రారంభం

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ప్రారంభమైంది. “సర్దార్‌ పటేల్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌గా” పిలుస్తున్న దీన్ని ఆదివారం ఉదయం లెఫ్టినెంట్‌ గవర్నర్ అనిల్‌ బైజల్‌ ప్రారంభించారు.

10వేల పడకలతో దీన్ని ఏర్పాటు చేశారు. నోడల్‌ ఏజెన్సీ ఆస్పత్రిని ఐటీబీపీ నిర్వహిస్తోంది. రాధా సోమి బియాస్‌ ఆధ్యాత్మిక సంస్థకు చెందిన కొంతమంది స్వచ్ఛందంగా సేవలందించనున్నారు. ఛత్తర్‌పూర్‌లో 70ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. 20 ఫుట్ బాల్ మైదానాలంత విస్తీర్ణంలో 200 ఎన్‌క్లోజర్స్‌తో ఈ కోవిడ్ కేర్ ఆస్పత్రిని నిర్మించారు.
దాదాపు 1700 అడుగుల పొడవు, 700 అడుగుల వెడల్పు ఉంటుంది ఈ కేంద్రం. స్వల్ప లక్షణాలు, అసలు లక్షణాలు లేనివారికి ఇక్కడ చికిత్స అందించనున్నారు. ఐటీబీపీ మరియు 250 ఐసీయూ పడకలు, ఇతర కేంద్ర సాయుధ బలగాలకు చెందిన 1,000 మందికి పైగా డాక్టర్లు, 2,000 మంది వైద్య సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడ సేవలు అందించనున్నారు

You might also like