FbTelugu

దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు

విజయవాడ: కృష్ణా జిల్లా ప్రజల చిరకాలవాంఛ నెరవేరబోతున్నది. కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయ్యింది. సెప్టెంబర్ 4 తేదీన ప్రారంభిస్తున్నట్లు ఆర్ అండ్ బీ శాఖ మంత్రి శంకర నారాయణ తెలిపారు.

దుర్గగుడి ఫ్లైఓవర్ పనులను మంత్రి శంకర నారాయణ గురువారం నాడు అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణపు పనులు మొత్తం పూర్తయ్యాయని, చిన్న చిన్న పనులు ముగించి వచ్చే నెల 4వ తేదీన ప్రారంభిస్తామని అన్నారు. దీంతో పాటు బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ ను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించి జాతికి అంకితం చేస్తారన్నారు. అదే విధంగా రూ.13వేల కోట్ల విలువైన పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని మంత్రి వెల్లడించారు.

ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో బెజవాడ నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

You might also like