FbTelugu

తెరచుకున్న మాల్స్, హోటళ్లు

అమరావతి: సుధీర్ఘ కాలం తరువాతం తెలుగు రాష్ట్రాల్లో షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు ప్రారంభమయ్యాయి. దేవాలయాల్లో దర్శనాలు మొదలయ్యాయి.

కరోనా కారణంగా రాష్ట్రంలో రెండున్నర నెలలుగా మూతపడిన ప్రార్థనా మందిరాలు తెరచుకోవడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా మాస్క్‌లు, శానిటైజర్లు వినియోగిస్తూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కంటైన్మెంట్ జోన్, రెడ్ జోన్ ఏరియాల నుంచి వచ్చే భక్తులకు ఆలయంలోకి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏపీ రాష్ట్రంలో 28 పర్యాటక కేంద్రాల్లో కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి.

వీటిలో ఒంటిమిట్ట రామాలయం, యాగంటి, లేపాక్షి, ద్రాక్షారామం, సామర్లకోట భీమవరం, పుష్పగిరితో పాటు పలు ఆలయాలు తెరచుకున్నాయి. తెలంగాణలో యాదగిరిగుట్ట, వేములవాడ రాజరాజేశ్వర స్వామి, భద్రాచలం, బాసర సరస్వతి, కొండగట్ట ఆంజనేయస్వామి, కురవి వీరభద్రస్వామి, కీసర శివాలయం తెరచుకోవడంతో భక్తులు దర్శనం కోసం క్యూ కట్టారు.

తెరచుకోని మంత్రాలయం

కర్నూలు జిల్లాలోని రాఘవేంద్ర స్వామి మఠం తెరచుకలేదు. మఠం చుట్టూ ప్రవేశ ద్వారాలు ఉండడం, అనుమతిస్తే నియంత్రించడం కష్టమనే ఉద్దేశంతో ఈ నెల 15వ తేదీ వరకు దర్శనాలు వాయిదా వేశారు. ఒకేవైపు ప్రవేశ ద్వారం ఏర్పాటు చేసిన తరువాత భక్తులను అనుమతించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.