FbTelugu

రేషన్ లో బియ్యం మాత్రమే ఉచితం…

అమరావతి: రాష్ట్రంలో రేషన్ సరుకుల పంపిణీ విధానంలో భారీ మార్పులు చేశారు. ఇప్పటివరకు రేషన్ పంపిణీలో బియ్యంతో పాటు కందిపప్పు లేదా శనగలు ఇస్తూ వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఈసారి బియ్యం మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం జులై నెల నుంచే నగదుకే సరుకులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నవంబరు వరకు రేషన్‌ను ఉచితంగా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంతో కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పటి వరకు రేషన్ సరుకులను ఉచితంగా పంపిణీ చేసింది.ఈ నెల 18 వ తేదీ నుంచి రెండో విడత రేషన్ పంపిణీలో కందిపప్పు లేకుండా కేవలం బియ్యాన్ని మాత్రమే ఇవ్వనున్నారు.

You might also like