FbTelugu

ఇక అన్ని బస్సులకూ ఆన్ లైన్ రిజర్వేషన్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో ఏపీఎస్ ఆర్టీసీ ఆన్ లైన్ టికెట్ రిజర్వేషన్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరిస్తోంది. ఇక నుంచి అన్ని బస్సుల్లోనూ ముందస్తు రిజర్వేషన్ టికెట్ వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించింది. బస్సుల్లో నగదు రహిత, కాంటాక్ట్ లెస్ టికెటింగ్ తీసుకునేలా వ్యవస్థను మార్చుతోంది.

పలు వినూత్న సేవలతో అధునాతన రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం ఒకేసారి 50 వేల మంది ప్రయాణికులు సేవలు పొందేలా వెబ్ సైట్ ను ఆధునీకరిస్తోంది. ఆధునీకరణ కారణంగా ఈనెల 30న సర్వర్ ను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్టు తెలిపింది. ఈనెల 30న రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆర్టీసీ వెబ్ సైట్ నిలిచిపోనుందని తెలిపింది. ఆ సమయంలో ఎలాంటి టికెట్ బుకింగ్ లు, రద్దు సౌకర్యం ఉండదని తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.