FbTelugu

యువతి కొంపముంచిన ఆన్ లైన్ ఫ్రెండ్‌షిప్‌

ఆన్ లైన్ ఫ్రెండ్‌షిప్‌ ఓ యువతిని కొంపముంచింది. యువతితో ఆన్ లైన్ లో పరిచయమైన ఓ యువకుడు చాకచక్యంగా యువతి పర్సనల్ డాటాను సేకరించి న్యూడ్ గా వీడియో కాల్ చేయాలంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ యువతి నిత్యం తన స్నేహితురాలితో పబ్జీ గేమ్ ఆడేది. ఈ క్రమంలో తన స్నేహితురాలి నుంచి ఓ యువకుడు పరిచయం అయ్యాడు. దీంతో ఆ యువకునితో నిత్యం ఫోన్ లో మాట్లాడుతూ తన మొత్తం సమాచారం, పాస్ వర్డ్ లను కూడా చెప్పేసింది. దీంతో ఆ యువకుడు తనతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడాలంటూ.. బ్లాక్ మెయిల్ చేశాడు. ఏంచేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like