FbTelugu

ఆన్ లైన్ లో పరీక్షలు అసాధ్యం: విద్యాశాఖ మంత్రి అశ్వత్థ

బెంగళూరు: గ్రాడ్యుయేషన్, పీజి పరీక్షలు ఆన్ లైన్ లో నిర్వహించడం కుదరదని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి అశ్వత్థ నారాయణ స్పష్టం చేశారు. ఆన్ లైన్ ద్వారానే పరీక్షలు జరపాలనే డిమాండ్ ను ఆయన తోసిపుచ్చారు.

ప్రభుత్వ యూనివర్సిటీలు, కళాశాలల్లో మౌలిక వసతులు లేనందున ఆన్ లైన్ డిమాండ్ ను ఆమోదించడం సాధ్యం కాదన్నారు. గతంలో నిర్వహించిన విధంగానే పరీక్షలు నిర్వహిస్తామని, డీమ్డ్, ప్రైవేటు యూనివర్సిటీల్లో ఆన్ లైన్ పరీక్షలకు అవకాశం ఉందన్నారు. ఆర్టీసి సమ్మె కారణంగా కొన్ని యూనివర్సిటీల్లో పరీక్షలు వాయిదా పడ్డాయని ఆయన అన్నారు. సమ్మె ముగిసిన తరువాత వాయిదా పడిన పరీక్షల తేదీలను ప్రకటిస్తామని మంత్రి అశ్వత్థ నారాయణ ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.