FbTelugu

విద్యార్థిని బలితీసుకున్న ఆన్ లైన్ క్లాసులు

కృష్ణా: తరగతి గదుల్లో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు అర్థం కాక విద్యార్థులు గందరగోళం అయిన రోజులు చూశాం. కరోనా కారణంగా ఇప్పుడు నిర్వహిస్తున్న ఆన్ లైన్ తరగతులు విద్యార్థులపై ఒత్తిడితో పాటు ప్రాణాలు మింగుతున్నాయి.

ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ ప్రాంతానికి చెందిన నడకుదిటి సత్యనారాయణ తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుమారుడు దినేష్ (18) గొల్లపూడిలోని ఒక కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆన్ లైన్ తరగతులు అర్థం కాక కొద్ది రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో సహచర విద్యార్థులు గేలి చేయడంతో మనస్థాపానికి గురైన దినేష్ ఈ నెల 13న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషం తీసుకున్నాడని తెలిసిన వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోయాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.