హైదరాబాద్: ఓ పక్క కరోనాతో ప్రజలంతా ఉక్కిరి బిక్కిరి అవుతుంటే.. మరో పక్క రాష్ట్రంలోని పలు ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు ఆన్లైన్ క్లాసుల పేరుతో కష్టకాలంలోనూ జలగల్లాగ విద్యార్థుల తల్లిదండ్రులనుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు.
ఫీజులు చెల్లించేందుకు ఏకంగా డెడ్ లైన్లను కూడా ఇస్తున్నారు. స్కూల్ యాజమాన్యాల డెడ్ లైన్లతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నమని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. పలువురు ఇలాంటి స్కూల్ యాజమాన్యాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.