FbTelugu

పంచాయతీల్లో ఆన్​లైన్ ఆడిట్ షురూ

హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో నిధుల వినియోగంలో పారదర్శకత కోసం ఈనెల (ఆగస్టు) 03వ తేదీనుంచి రాష్ట్రంలోని గ్రామపంచాయతీల్లో ఆన్​లైన్​ ఆడిట్ ను ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్ధిక సంఘం నిధుల విడుదల చేయాలంటే ఆన్​లైన్​ ఆడిట్​ తప్పనిసరి చేసింది.

ఈ ఏడాది చివరి నాటికి దేశంలో 20 శాతం గ్రామాల ఆడిట్​ ప్రక్రియఅంతా ఆన్​లైన్​లోనే నిర్వహించాలని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 30 శాతం గ్రామాల్లో ఆడిట్ ప్రారంభం కానుంది. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులకు, ఆడిటర్లకు మార్గదర్శకాలు ఇప్పటికే విడుదల చేశారు.

You might also like