FbTelugu

పులికోసం కొనసాగుతున్న గాలింపు

* నాగులు రోజులుగా పశువులపై దాడులు
పశ్చిమగోదావరి: తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా పెద్దపులుల, చిరుతల గాండ్రింపులు ఎక్కువైనాయి. తాజాగా జిల్లాలోని కుక్కనూరు, వేలేరుపాడు మండలాల్లో జనావాసాల్లో పులిసంచరిస్తూ.. పశువులపై దాడులు చేస్తుండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు.

సమారం అందుకున్న అటవీశాఖ అధికారులు అప్రమత్తమై పులికోసం గాలింపు చేపట్టారు. పులి జాడ కోసం 4 ట్రాప్ కెమెరాలు, రెండు బోన్లు ఏర్పాటు చేసినట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్రజలెవరూ ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.