FbTelugu

కొనసాగుతున్న విశాఖ బంద్

విశాఖపట్నం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతరేకంగా రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఈ ఉద్యమంలో బీజేపీ నాయకులు మినహా అన్ని పార్టీలు పాల్గొన్నాయి.

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపు మేరకు రాష్ట్రంలోని రాజకీయ  పార్టీలు, ప్రజా, కార్మిక సంఘాలు, లారీ యజమానుల సంఘాలు బంద్‌లో సంపూర్ణంగా పాల్గొన్నాయి. వైసీపీ  ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం తరువాత నడవనున్నాయి. బీజేపీ మినహా అన్ని పార్టీల రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు కూడా బంద్‌ను విజయవంతం చేయాలని జిల్లాల్లోని తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం బంద్‌కు సహకరించాలని, మద్దతివ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్నినాని గురువారం నాడు ప్రకటించారు. ఆర్టీసీ బస్సులను మధ్యాహ్నం ఒంటిగంట వరకు నడపడం లేదని పేర్ని నాని తెలిపారు.

నేటి నుంచి విశాఖలో చంద్రబాబు…

టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు నేటి నుంచి రెండ్రోజులపాటు విశాఖలో పర్యటించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన విశాఖ చేరుకుని స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జరుగుతున్న బంద్‌కు సంఘీభావం తెలపనున్నారు. ఇవాళ రాత్రికి అక్కడే బస చేసి శనివారం ఉదయం నుంచి నగరంలో జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.