FbTelugu

భారత్, చైనా సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తత

జమ్ముకశ్మీర్: భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. చైనా బలగాలు పాంగాగ్ సో సరస్సు ప్రాంతానికి భారీ ఎత్తున రావడంతో అప్రమత్తమైన భారత్ ఈ సారి ఓ పక్క చర్చలు జరుగుతుండగానే చైనా బలగాలను తిప్పికొట్టేందుకు భారీగా సైన్యాన్ని మొహరించింది.

యాంటీ ట్యాంక్ మిసైళ్లను భారత్ భారీ ఎత్తులో అక్కడికి తరలించి చైనా కవ్వింపు చర్యలు గట్టి బదులిచ్చేందుకు కూడా సిద్దమైంది. ఈ క్రమంలోనే ఇర దేశాల బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయి. కాగా భారతే మొదట కాల్పులకు పాల్పడిందని చైనా ఆరోపిస్తోంది.

You might also like