FbTelugu

లడఖ్ లో కొనసాగుతున్న ఉద్రిక్తత

భారత్-చైనా సరిహద్దు ప్రాంతమైన లడాఖ్ లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. సరిహద్దు వివాదంపై చైనా.. ఓ పక్క చర్చలంటూనే.. మరో పక్క సైన్యాన్ని భారీ స్థాయిలో మొహరిస్తోంది. ఈ చర్యలు గమనిస్తున్న భారత్ చైనాకు దీటుగానే సమాధానం చెబుతోంది.

భారత సైన్యాన్ని కూడా సరిహద్దులో భారీగానే మొహరించింది. చైనా దూకుడు చర్యలకు కళ్లేం వేసేందుకు భారత్ సర్వం సిద్ధంగానే ఉంది. భారత్-చైనా ఒప్పందాలను చైనా పూర్తిగా ఉల్లంఘించడం, ద్వంద వైఖరిపై ప్రపంచ వేధికపై చైనాను ఎండగట్టేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.

You might also like