FbTelugu

తెలంగాణలో కొనసాగుతున్న ప్లాస్మా సేకరణ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న బాధితుల నుంచి ప్లాస్మా సేకరణ కొనసాగుతోంది. కరోనా నుంచి కోలుకున్న బాధితులు ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు వస్తున్నట్టు అధికారులు తెలిపారు.

నిన్న ఇద్దరు వ్యక్తుల నుంచి ప్లాస్మా సేకరించినట్టు గాంధీ డాక్టర్లు తెలిపారు. తెలంగాణలో తొలి కరోనా పాజిటివ్ వ్యక్తి నుంచి కూడా ప్లాస్మా సేకరించినట్టు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం నలుగురినుంచి ప్లాస్మా సేకరించినట్టు తెలిపారు.

You might also like