FbTelugu

కొనసాగుతున్న మావోయిస్టు వారోత్సవాలు

ఏవోబీలో మావోయిస్టు వారోత్సవాలు కొనసాగుతున్నాయి. మావోయిస్టులు తలపెట్టిన వారోత్సవాల్లో గిరిజనులు భారీగా హాజరై ర్యాలీలు తీసినట్టుగా సమాచారం.

ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించినట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా.. ఏవోబీలో పోలీసుల బలగాలు  తీవ్రంగా గాలింపులు చేపట్టి వరుస  ఆపరేషన్లు నిర్వహించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ మవోయిస్టులు వారోత్సవాలకు పిలుపునిచ్చి నిర్వహిస్తున్నారు.

You might also like