FbTelugu

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మరో మూడు రోజుల పాటూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తీరంలో మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.

You might also like