FbTelugu

వివేకా హత్య కేసుపై కొనసాగుతున్న విచారణ

అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైయస్ వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలంటూ వచ్చిన పిటిషన్లపై నేడు ధర్మాసనం విచారణ చేస్తోంది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది పలు అంశాలను న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు.
హత్య జరిగి ఏడాది గడుస్తున్నా ఇంత వరకు ఎటువంటి ఆధారాలు గుర్తించలేదని, సిట్ లు ఏర్పాటు చేస్తున్నారే తప్ప విచారణ సజావుగా జరగటంలేదని తెలిపాడు. హత్య చేసిన ఆనవాళ్లు ఉన్నా.. అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేశారని పేర్కొన్నాడు. ఇప్పటి వరకు కేసుకు సంబంధించి ఎటువంటి సమాచారం పోలీసులు వెలికి తీయలేదన్నాడు. కేసును తప్పుదారి పట్టించే విధంగా ఉన్న సూసైడ్ లెటర్ ను కుమార్తె కు ఇచ్చారని, డ్రైవర్ ను ఉదయం రమ్మంటే వచ్చి గొడవ అవటంతో హత్య చేశారని ఆ లెటర్ లో ఉండటం చూస్తే కేసు పక్కదారి పట్టించటానికే వేరే వ్యక్తి ఇలా చేసారనేది న్యాయమూర్తి దృష్టికి తెచ్చాడు.

అయినా ఇప్పటి వరకు డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేయలేదన్నతెలిపాడు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ ఆ సమయంలో ఈ కేసు సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేసి ఇప్పుడేమో తన పిటిషన్ ను ఉపసంహరణ చేశారన్నారు. కాగా వేరే వాళ్ళ పిటిషన్ విషయాలు ప్రస్తావించవద్దని, తమ పిటిషన్ వరకు మాత్రమే మాట్లాడాలని న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశాడు. కేసు సీబీఐకి ఇవ్వటానికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా కౌంటర్ వేస్తారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. అభ్యంతరం లేదని తెలిపినట్టు తెలుస్తోంది.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More