FbTelugu

కొనసాగుతున్న అల్పపీడనం

అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని ఐఎండీ (భారత వాతావరణ విభాగం) తెలిపింది. బురేవి తుపాను బలహీనపడి అల్ప పీడనంగా మారిందని పేర్కొంది.

ఇప్పటికే బురేవీ ప్రభావంతో తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.