FbTelugu

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

కర్నూలు: గత కొన్ని రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రస్తతం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 85,974 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 40,253 క్యూసెక్కులు గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 851.60 కు చేరింది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు.

You might also like