FbTelugu

ఒకట్రెండేళ్లు కరోనాతో జీవించాల్సిందే: ఎర్రబెల్లి

హైదరాబాద్: మరో ఒకట్రెండేళ్లు కరోనాతో జీవించాల్సిందేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో బీజీపీ ఇచ్చిన ప్యాకేజీ ఒక పనికి రాని ప్యాకేజీ అని అన్నారు.

ఆపదలో ఆదుకోవాల్సింది పోయి అక్కరకు రాని ప్యాకేజీలు ఇచ్చారని అన్నారు. రాష్ట్రాన్ని కుదువపెడితే అప్పులిస్తారట అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు దిక్కులేదని అన్నారు. దేశంలో రైతుల పంటలకు కనీస మద్దతు ధర వచ్చే పరిస్థితి లేదన్నారు.

You might also like