FbTelugu

ఢిల్లీలో గంటకు వెయ్యి కేసులు!

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఢిల్లీ ప్రజలను ఠారెత్తిస్తున్నది. ప్రతి గంటకు ఒక వెయ్యి చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 24,375 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి.

ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఒక్కరోజులో నమోదు అయిన కేసులలో ఇవే అత్యధికం కావడం గమనార్హం. అదే విధంగా గడచిన 24 గంటల వ్యవధిలో 167 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివ్ కేసుల నమోదు శాతం 24.56 శాతానికి చేరుకున్నది. ఈ లెక్కన ప్రతి వంద మందిని పరీక్షిస్తే 25 మంది కి వైరస్ నిర్థారణ అవుతున్నది. ఢిల్లీలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయని, పరిస్థితి ఏమాత్రం బాగా లేదని సిఎం అరవింద్ కేజ్రీవాల్ పెదవి విరిచారు. హరిద్వార్ కుంభమేళా నుంచి ఢిల్లీ వచ్చిన వారు తప్పనిసరిగా రెండు వారాల పాటు హోం క్వారంటైన్ లో ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో మంచాల లభ్యత పై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని కేజ్రీవాల్ వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.