FbTelugu

ఆక్సిజన్ వ్యాపారి ఔదార్యం…

ఒక్క రూపాయికే సిలిండర్ 

లక్నో: కరోనా సెకండ్ వేవ్ లో పాజిటివ్ వచ్చినవారు శ్యాస అందక నరకయాతన అనుభవిస్తున్నారు. దీంతో దేశంలో ఆక్సిజన్ కొరత ఏర్పడగా, దళారులు సొమ్ము చేసుకుంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు సాయం అందించేందుకు యుపి వ్యాపారి ముందుకు వచ్చారు. ఒక్క రూపాయి ఇస్తే చాలు ఆక్సిజన్ సిలిండర్ నింపి ఇస్తున్నారు. ఆయనే హమీర్ పూర్ జిల్లాలోని మనోజ్ గుప్తా. సుమేర్ పూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో రిమ్ జిమ్ ఇస్పాత్ ఫ్యాక్టరీ యజమాని. ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్ కొరత చూసి ఆయన చలించిపోయారు. గతేడాది ఆయనకు కరోనా సోకింది. ఆ అనుభవంతో ఆయన బాధితులకు బాసటగా ఉండాలని నిర్ణయించాడు. నిజానికి తన ప్లాంట్ లో ఉత్పత్తి అవుతున్న ఆక్సిజన్ ఉచితంగా అందించాలని నిర్ణయించాడు. కాని ప్రతి సిలిండర్ కు బిల్లింగ్ చేయాల్సి ఉండడంతో కనీస ఛార్జీ రూ.1 గా నిర్ణయించాడు. తన ఫ్లాంట్ లో రోజుకు ఒక వేయి సిలిండర్లను రీఫిల్లింగ్ చేసే సామర్థ్యం ఉందని మనోజ్ తెలిపారు. లక్నో, బందా, లలితపూర్, ఝాన్సీ, కాన్పూర్ ప్రాంతాల నుంచి తమ ప్లాంట్ వద్దకు వస్తున్నారని ఆయన తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.