FbTelugu

ఆ విషయంలో ఒకటో స్థానం.. ఈ విషయంలో రెండోస్థానం

ఇండియాలో కరోనా నానాటికీ విజృంభిస్తోంది. కొంత కొంతగా పెరిగి ఇప్పుడు ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరుకుంది. మరికొద్ది రోజులు పోతే మొదటి స్థానానికి చేరుకునే ప్రమాద పరిస్థితి కూడా ఉంది. ఇండియాలో రోజుకు 50 వేల నుంచి 90వేల దాకా కరోనా కేసులు నమోదవుతున్నాయి.

దీంతో దేశవ్యాప్తంగా జనం ఆందోళనకు గురవుతున్నారు. కేసుల విజృంభణను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అది సాధ్యం కావడం లేదు. లాక్‌డౌన్‌ ఎత్తివేత తర్వాత దాని స్పీడు మరింతగా పెరిగింది. ఇటీవల కాలంలో కొంత తీవ్రత తగ్గుతున్నా అది ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. అయితే, ఎక్కువ కేసులు నమోదు కావడంలో ఇండియా రెండో స్థానంలో నిలిస్తే.. కరోనాను తట్టుకొని దాని బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఇండియాలో గణనీయంగా పెరుగుతోంది.

కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య ప్రపంచంలో ఇండియాలోనే ఎక్కువగా ఉంది. ఈ విషయంలో ఇండియా మొదటి స్థానంలో నిలిచింది. ఇది ఇండియా వాసులకు సంతోషకరమైన వార్త. ఇటీవల కాలంలో కరోనా బారిన పడినవారికంటే కోటుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువగా నమోదు కావడం శుభపరిణామం. ఇండియాలో మొత్తం ఆదివారం నాటికి 43లక్షలా ఎనిమిది వేల 431 మంది కరోనా బారి నుంచి రికవరీ అయ్యారు. ఇండియాలో రికవరీ రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో బిహార్‌ మొదటి స్థానంలో ఉంది. తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. మొత్తానికి ఇండియా కరోనా కేసుల్లో ప్రపంచంలో రెండోస్థానంలో నిలిస్తే.. రికవరీలో మొదటి స్థానంలో నిలిచింది. ఏది ఏమైనా ఇండియాలో రికవరీ రేటు పెరగడం ఆనందించాల్సిన విషయమే.

You might also like

Leave A Reply

Your email address will not be published.