FbTelugu

ఏటిఎం వద్ద కాల్పులు.. ఒకరు మృతి

హైదరాబాద్: కూకట్ పల్లి లో హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు ఏటిఎం వద్ద సిబ్బంది డబ్బులు నింపుతున్న సమయంలో అగంతకులు కాల్పులు జరిపారు. సెక్యూరిటీ గార్డ్ తో పాటు ఏటీఎం సిబ్బందిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒకరు గాయపడగా మరొకరు చనిపోయారు.

దుండగులు ఇద్దరు పై కాల్పులు జరిపి డబ్బులను దోచుకెళ్లారు. డబ్బులు నింపుతుండగా కాల్పులు జరిపారని సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. కాల్పుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు వెంటనే ఆస్పత్రికి తరలించారు. గార్డ్ అలీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దోపిడీకి పాల్పడ్డ నిందితుల కోసం పోలీసులు గాలింపు మొదలు పెట్టారు. ఘటనా ప్రాంతాన్ని సైబరాబాద్ పోలీసు కమిషనర్ విసి.సజ్జనార్ సందర్శించారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.