FbTelugu

జాగ్వార్ కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి

హైదరాబాద్: మాదాపూర్ హైటెక్ ఫ్లై ఓవర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లో ఒకరు మృతి చెందారు. ఆదివారం తెల్లవారు జామున రోడ్డు దాటుతున్న వ్యక్తిని జాగ్వార్ కారు వేగంతో ఢీ కొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు.

కె.పి.హెచ్.బి నుంచి మాదాపూర్ వైపు కారు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయాలపాలైన వ్యక్తి ఆసుపత్రి తరలించే లోపే అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు పోలీసులు తరలించారు. వేగంగా కారు నడిపిన వ్యక్తి వివరాలు వెల్లడించడానికి మాదాపుర్ పోలీసులు తడబడుతున్నారు. ఈ కారు సౌరబ్ గుప్తా పేరు పై ఉండగా, రాజేంద్రనగర్, టోలిచౌకి, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలలో నాలుగు ఓవర్ స్పీడ్ చలానాలు ఉన్నాయి. ఈ కారుపై మొత్తం రూ.4375 ల జరిమానా పెండింగ్ లో ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.