FbTelugu

10 మందిని చంపింది ఒక్కడే: కమిషనర్

వరంగల్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నగర శివారు గొర్రెకుంట పాడుబడ్డ బావిలో తొమ్మిది మంది మృతుల కేసును ఛేదించినట్లు వరంగల్ నగర పోలీసు కమిషనర్ రవీందర్ తెలిపారు.

ఇవాళ సాయంత్రం నగర పోలీసు కమిషనర్ మీడియాకు వెల్లడించారు. నగర శివారు గొర్రెకుంటలోని గోదాం యజమాని ఫిర్యాదు మీద 21తేదీన కేసు నమోదు చేశామన్నారు. 21న  సాయంత్రం 4 మృతదేహాలు వెలికితీశామన్నారు. ఇంకా నలుగురి ఆచూకీ తెలియకపోవడంతో 22 న బావిలో ఉన్న నీటిని తొడగా 5 మృతదేహాలు లభించాయి. ఈ కేసును ఛేదించేందుకు కమిషనరేట్ పరిధిలో 6 బృందాలు నియమించామన్నారు.

ఇవే కాకుండా హైదరాబాద్ నుంచి క్లూస్ టీం ను రప్పించాం. వెస్ట్ బెంగాల్ నుంచి వలస వచ్చిన ఇక్కడే స్థిరపడిన మాక్సుద్ అతని భార్య గొనె సంచుల ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. ఈ క్రమంలో మాక్సూద్, సంజయ్ కుమార్ యాదవ్ కు పరిచయం ఏర్పడింది. మాక్సూద్ కుటుంబంతోనే ఉంటున్న బంధువు అయిన రఫీకాకి సంజయ్ కుమార్ యాదవ్ కు పరిచయం ఏర్పడింది.

ఇద్దరి మధ్య చనువు పెరిగి, అక్రమ సంబంధానికి దారి తీసింది. పెళ్లి చేసుకోవాలని లేదంటే పోలీసుకు ఫిర్యాదు చేస్తానని సంజయ్ ను హెచ్చరించించిది. ఆమెను మట్టుపెట్టాలని నిర్ణయించిన సంజయ్, రఫికా ను తీసుకొని బెంగాల్ కు తీసుకువెళ్లాడు. పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఇద్దరు  రైలులో బయలుదేరారు. రైలులోనే ఆమెకు మత్తు మందు ఇచ్చి, చున్నీతో గొంతు నుమిలి బయటకు తోసేసాడు.

ఆ తరువాత సంజయ్ తిరిగి వరంగల్ వచ్చాడు. రఫికా విషయం ఏంటని మక్సూద్ భార్య సంజయ్ ను నిలదీసింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించడంతో సంజయ్ లో భయాందోళన మొదలైంది. రఫికా హత్య బయటకు రాకుండా ఉండేందుకు మక్సూద్ కుటుంబాన్ని మట్టుబెట్టాలని నిర్ణయించాడు.

కుటుంబం మొత్తాన్ని హత్య చేయడానికి 4రోజుల ముందే హన్మకొండ లోని మెడికల్ షాప్ లో స్లీపింగ్ టాబ్లెట్ లు సంజయ్ తీసుకున్నాడు. ఎవరు లేని సమయంలో వారు తినే ఆహార పదార్ధాలలో మత్తు మందు కలిపాడు. మక్సూద్ దూరపు బంధువు షకీల్ అనే వ్యక్తి కూడ అక్కడే వున్నాడు. అర్థారాత్రి 12.30 సమయంలో ఒక్కడే, నిద్రలోకి జారిన అందరిని ఒక్కొక్కరిగా గోనెసంచిలో తీసుకొని వెళ్లి బావిలో పడేసాడు. సైకిల్ మీద తిరిగి 6 గంటల సమయంలో తిరిగి వెళ్ళాడు.

అయితే ఈ హత్యలను చేదించడానికి సీసీ టీవీ ఫుటేజ్ బాగా ఉపయోగపడిందని కమిషనర్ తెలిపారు. తొందరలోనే పక్కా ఆధారాలు సేకరించి, ముద్దాయికి శిక్ష పడే విధంగా చేస్తామని రవీందర్ అన్నారు.

You might also like