FbTelugu

ఆగ్రో ప్రమాదంలో ఒకరి మృతి

కర్నూలు: నంద్యాల సమీపంలోని ఎస్​పీవై ఆగ్రో పరిశ్రమలో మళ్లీ ప్రమాదం జరిగింది. బాయిలర్‌ యూనిట్‌లో వేడి నీళ్లుపడి ప్రమాదం చోటుచేసుకుందని కార్మికులు తెలిపారు.

ఈ ఘటనలో పైపు నుంచి వేడి నీరు పడి లక్ష్మణ మూర్తి అనే కార్మికుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలు కాగా వారిని నంద్యాల ప్రభుత్వఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా అమ్మోనియా గ్యాస్ లీకయిన ఘటనలో ఒకరు మృతి చెందారు. 

You might also like