FbTelugu

మరోసారి గడువు కోరిన జగన్ న్యాయవాదులు

హైదరాబాద్: ఏపి సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలుకు మరోసారి గడువు కోవాలని కోరగా సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం అంగీకరించింది. ఇదే చివరి అవకాశం అని సిబిఐ, జగన్ తరఫు న్యాయవాదులకు కోర్టు స్పష్టం చేసింది.
జగన్ బెయిల్ పిటీషన్ రద్దు చేయాలంటూ వైసిపి ఎంపి కె.రఘురామ కృష్ణమరాజు దాఖలు చేసిన పిటీషన్ పై ఇవాల సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది.

కౌంటర్ దాఖలు చేసేందుకు మరోసారి గడువు కావాలని జగన్ తరఫు న్యాయవాదులు అభ్యర్థించారు. సిబిఐ తరఫు న్యాయవాది కూడా కోరడంతో చివరి అవకాశం ఇస్తూ కేసును ఈ నెల 26కు వాయిదా వేసింది. ఇప్పటికే రెండుసార్లు గడువు కావాలని అడగడంతో సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం గడువు ఇచ్చిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.