FbTelugu

మరోసారి విచారణకు రావాలన్నారు: రంగనాయకమ్మ

విజయవాడ: వైజాగ్ లీకేజీ పై విచారణకు మరోసారి రావాలని సీఐడీ అధికారులు సూచించారని రంగనాయకమ్మ తెలిపారు.

గ్యాస్ లీకేజీ ఘటనపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన గుంటూరుకు చెందిన రంగనాయకమ్మ తో పాటు మరొకరిని సీఐడీ అధికారులు ఇవాళ విచారించారు. విచారణ తరువాత బయటకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. తనతో మరో వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారని అన్నారు. ఆయనను విచారించే సమయంలో కూడా తనను హాజరు కావాలని చెప్పారని ఆమె తెలిపారు.

గతంలో తాను ఫేస్ బుక్ లో చేసిన పోస్టింగ్ లపై ప్రశ్నలు వేశారన్నారు. టీవీ ఛానళ్లు, పత్రికల్లో వచ్చిన వార్తలను మాత్రమే పోస్ట్ చేశానన్నారు. ఇదే విషయాన్ని సీఐడీ అధికారులకు తెలియచేశానన్నారు. పిలిచినప్పుడు విచారణ రావాల్సిందిగా వారు కోరగా, తప్పకుండా వస్తానని చెప్పానని రంగనాయకమ్మ తెలిపారు. సీఐడీ కార్యాలయానికి ఆమెతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కుటుంబ సభ్యులు వెళ్లారు.

You might also like