FbTelugu

టీడీపీ ఓటమిపై విజయసాయి సెటైర్లు

అమరావతి: తెలంగాణలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్క టీడీపీ అభ్యర్థి కూడా గెలవకపోవడం పట్ల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు.. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా.. పలు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ 106 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఏమాత్రం ప్రభావాన్ని చూపలేకపోయిందన్నారు.

ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగినా టీడీపీకి ఫలితాలు ఇలాగే వస్తాయన్నారు. ‘‘హెచ్ఎంసీ ఎన్నికలలో 106 స్థానాల్లో పోటీ చేస్తే దక్కింది సున్నా! కిందటిసారి తండ్రి కొడుకులు, మద్దతుదారులైన సినీ నటులు ప్రచారం చేస్తే ఒక్కటంటే ఒక్కటి గెల్చారు. బాబు పార్టీ ఎగబాకుతుందో దిగజారుతోందో చెప్పడానికి ఈ ఫలితాలే సాక్ష్యం. ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగినా రిజల్ట్ ఇలాగే ఉంటుంది’‘ అంటూ ట్వీట్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.