FbTelugu

18న ఖైరతాబాద్‌ గణేషుడి కర్రపూజ

హైదరాబాద్‌: ఖైరతాబాద్ లైబ్రరీ ముందు ఈ నెల 18వ తేదీ ఏకాదశి తొలిరోజు కర్రపూజ నిర్వహించి గణేష్ విగ్రహ ప్రతిష్టాపన పనులు ప్రారంభించనున్నారు.

ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే మహాగణపతి ఉత్సవాలను ఈసారి ఘనంగా నిర్వహించాలని ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు నిర్ణయించారు. 18న సాయంత్రం 5 గంటలకు కర్ర పూజ చేసి పనులు ప్రారంభించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. కర్రపూజలో పాల్గొనే వారు తప్పనిసరిగా మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. కరోనా వైరస్‌ వ్యాప్తితో దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో విగ్రహ తయారీ, ఎత్తు విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంపై పోలీసుల అనుమతి తీసుకుని ఎత్తు, తయారీ నిర్ణయించి ముందుకు వెళ్తామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.