FbTelugu

పెండింగ్ ప్రాజెక్టులపై.. దీక్షలకు ఉత్తమ్ రెడీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మొదటినుంచి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ఎందుకు పూర్తి చేయలేదన్న నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెండింగ్ ప్రాజెక్టుల వద్ద దీక్షలు చేపట్టనున్నట్టు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

దీనికోసం కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఈ దీక్షలకు సంబంధించి కార్యాచరణను కూడా ప్రకటించారు. జూన్ 2న కృష్ణా నదిపై వివిధ ప్రాజెక్టుల వద్ద దీక్షలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఈ దీక్షలు చేపట్టనున్నట్టు తెలిపారు.
జూన్ 6న గోదావరి నదిపై పెండింగ్ ప్రాజెక్టుల వద్ద దీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు.

You might also like