FbTelugu

ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై జగన్ ఆగ్రహం

అమరావతి: కరోనాను ఎదుర్కోవడంలో రాష్ట్రానికి మంచిపేరు వస్తుందని, దీన్ని తట్టుకోలేక తప్పుడు రాతలు రాస్తున్నారని సీఎం వైఎస్.జగన్‌ మోహన్ రెడ్డి అన్నారు. ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించడానికి చేస్తున్న ప్రయత్నంగా ఆయన ఉదహారించారు.
కరోనా వైరస్ వ్యాప్తి పై సమీక్ష సందర్భంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చిన కథనాలను ప్రస్తావనకు వచ్చిననప్పుడు సీఎం స్పందిస్తూ ఈమాటలు అన్నారు. ఈరెండు కథనాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్యశాఖ అధికారులు సిఎంకు తెలిపారు. ఏలూరు ఆశ్రమ్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత వల్ల రోగులు చనిపోయినట్టుగా ఫ్రంట్‌ పేజీలో వార్త రాశారని సిఎ తెలిపారు. విస్తారంగా ఆక్సిజన్‌ లభ్యత ఉన్నప్పుడు కూడా అదే పనిగా ఈ వార్త రాశారు. మనసులో కుళ్లుకుతంత్రాలు ఉంటేనే ఇలాంటి వార్తలు రాస్తారు, రాసే వార్తల్లో కనీస మానవత్వాన్ని చూపలేదన్నారు. ఆశ్రమ్‌ ఆస్పత్రిలో మరణాలంటూ ‘‘ఈనాడు’’ రాసిన కథనంపై పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ పంపిన నివేదికలోని వివరాలను వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ముఖ్యమంత్రి కి వివరించారు. దొరబాబు 25 రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని, డాక్టర్లు సీపీఏపీ వెంటిలేటర్‌ మీదకు మార్చి ప్రాణాలు కాపాడేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తోడుకావడంతో మరణించారన్నారు.
ఈనాడు దినపత్రికలో రాసిన విధంగా మరణించిన వారిలో మరో ఇద్దరు జె. నాగలక్ష్మి (42) కార్డియాక్‌ అరెస్ట్‌తో ప్రాణాలు కోల్పోయారని, ఈమరణానికి శ్వాససంబంధమైన అంశం సమస్యకాదని స్పష్టంచేశారన్నారు. 55 ఏళ్ల బెంజిమన్‌ అనే వ్యక్తి కూడా కార్డియాక్‌ అరెస్ట్‌ కారణంగా మరణించారని దీనికి శ్వాససంబంధమైన సమస్య కారణం కాదన్నారు. 26వ తేదీన ఆశ్రమం ఆస్పత్రిలో కరెంటు సరఫరా నిలిచిపోలేదని స్పష్టంచేశారన్నారు. ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించడానికి ఇలాంటి వార్తలు రాస్తున్నారని సిఎం జగన్ పేర్కొన్నారు.

‘‘ఆంధ్రజ్యోతి’’ పత్రికలో ఉద్దేశపూర్వకంగా రాసిన కొన్నిరాతలనుకూడా నా దృష్టికి తీసుకు వచ్చారని సిఎం తెలిపారు. కరోనా పై సమీక్షా సమావేశం సందర్భంగా ఇంతమంది అధికారుల ముందు కరోనా లేదని నేను అన్నట్టుగా, చులకనగా చూశానంటూ రాతలు రాసిన విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. నన్ను కోట్‌చేస్తూ ఈ మాటలు రాశారని చెప్పారు. ఇలాంటి రాతలు ద్వారా ముఖ్యమంత్రి అనే పదవికి విలువ తగ్గించి, దాన్ని అథమస్థాయిలోకి తీసుకెళ్తున్నారు. కరోనా ను ఎదుర్కోవడంలో రాష్ట్రానికి మంచిపేరు వచ్చిందని చెప్పి ఇలాంటి రాతలు రాస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి దిన పత్రికలు రాసిన వార్తలపై న్యాయప్రకారం చర్యలు, చట్టంప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు సిఎం జగన్ కు అధికారులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.