FbTelugu

13 ఆసుపత్రులపై రూ. 56 లక్షల జరిమానా

మచిలీపట్నం: జిల్లాలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించని 13 ఆసుపత్రులకు రూ.56 లక్షలు జరిమానా విధించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) ఎల్.శివశంకర్ తెలిపారు.

నగరంలో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న హాస్పిటల్స్ పై జిల్లా కోఆర్డినేటర్, ఆరోగ్యశ్రీ అధికారులు, విజిలెన్స్ సిబ్బంది ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించినట్లు ఎల్. శివశంకర్ తెలిపారు. హాస్పిటల్స్ వైద్యులు రోగులకు అందిస్తున్న సేవలపై ఆరాతీసి, ప్రభుత్వ ఉత్తర్వులు అతిక్రమించి, రోగుల వద్దనుండి అధిక వసూళ్లుకు పాల్పడినట్లు తేలింది. 11 హాస్పిటల్స్ పై మే నెల 15వ తేదీ వరకు రూ. 44 లక్షల అపరాధ రుసుము వేసినట్లు తెలిపారు. అలాగే 22వ తేదీన నిర్వహించిన తనిఖీల్లో విజయవాడ స్మైల్ హాస్పిటల్ పై రూ. 6 లక్షలు, ఈవిఆర్ హెల్త్ హాస్పిటల్ పై రూ.6 లక్షలు పెనాల్టీ వేశామని వివరించారు. మొత్తంగా ఇప్పటివరకు రూ. 56 లక్షలు జరిమానాను విధించినట్లు జెసి శివశంకర్ వెల్లడించారు. పెనాల్టీ విధించటంతో పాటుగా కొన్ని హాస్పిటల్స్ కు కరోనా అనుమతులు రద్దు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.