FbTelugu

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ భయాలు..

దేశంలో కరోనా ‘ఒమిక్రాన్​ వేరియంట్​’ కలకలం సృష్టిస్తోంది. మహారాష్ట్రలో ఒక్కసారిగా ఏడు కేసులు వెలుగు చూశాయి. కరోనా నిర్ధారణ అయిన వారిలో మూడేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు తెలిసింది.

కొత్తగా ఒమిక్రాన్​ సోకిన వారంతా.. బ్రిటన్​, దక్షిణాఫ్రికా, టాంజానియా వంటి దేశాల నుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా ఉన్న వారేనని గుర్తించారు అధికారులు.

ముంబయి, పింపిరి చించ్​వాడ్ మున్సిపల్ కార్పొరేషన్​​, పుణె ప్రాంతాల్లో ఈ కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా కేసులతో మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 17కు చేరింది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 32కు పెరిగింఒమిక్రాన్​ కేసుల పరంగా మహారాష్ట్ర (17) మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ (9), గుజరాత్​ (3), కర్ణాటక (2), ఢిల్లీ (1) ఉన్నాయి.

..మహారాష్ట్రలో కొత్తగా కొవిడ్ సోకిన వారిలో నలుగురికి లక్షణాలు ఏవి లేవని.. ముగ్గురికి మాత్రం స్వల్ప లక్షణాలు ఉన్నట్లు తెలిపారు అధికారులు. అయితే ఒమిక్రాన్​ సోకిన వారిలో చాలా వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారేనని తెలిపారు.

కరోనా ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తుందన్న సమయంలో కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ బయటపడింది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ రకం కరోనా వైరస్​.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. దీనితో చాలా దేశాలు కఠిన ఆంక్షలు మళ్లీ అమలు చేస్తున్నాయి. ప్రయాణ ఆక్షలు, మాస్క్ పెట్టుకోవడం, వాక్సిన్​ వేసుకోవడం తప్పనిసరి వంటివి చేస్తున్నాయి.

మన దేశంలో కూకా వివిధ రాష్ట్రాలు ఇప్పటికే కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.