FbTelugu

ఓఎల్ఎక్స్… సైబర్ నేరగాళ్ల అడ్డా

కేంద్రానికి లేఖ రాసిన సైబరాబాద్ పోలీసులు

హైదరాబాద్: ఓఎల్ఎక్స్ వెబ్ సైట్ లో ఇకనుంచి కొనుగోళ్లు, అమ్మకాలు జరపవద్దని సైబరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు. ఈ వెబ్ సైట్ సైబర్ నేరగాళ్ల చేతుల్లో ఉందని పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఓఎల్ఎక్స్ పై చర్యలు తీసుకోవాలంటూ సైబరాబాద్ పోలీసులు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. భరత్ పూర్, మేవాట్ కు చెందిన సైబర్ నేరగాళ్లు తిష్టవేసి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారని కేంద్రానికి తెలిపారు. దీనిపై విచారించి వెబ్ సైట్ ను పూర్తిగా నిషేధించాలని కోరినట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతిరోజు వందల సంఖ్యలో ఓఎల్ఎక్స్ పై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.