FbTelugu

అన్న‌య్య రూటు మార‌నున్నారా!

తెలుగు సినిమాకు పెద్ద‌న్న‌. ప్రేక్ష‌కుల గుండెల్లో అన్న‌య్య‌. కోట్లాది మంది మ‌న‌సు దోచిన మెగాస్టార్ కొత్త క‌థ‌ల కోసం వెతుకుతున్నార‌ట‌. బ్రేక్‌లు. షేక్‌ల‌ను మించిన స‌రికొత్త పంథాలో వ‌య‌సుకు త‌గిన‌ట్టుగా.. వినోదం.. సందేశం క‌ల‌బోసిన సినిమాలు తీయాల‌నే ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ట‌.

దానికోస‌మే లూసిఫ‌ర్ రీమేకింగ్ ఒప్పుకున్నార‌ట‌. మ‌ధ్య‌లో ప్ర‌భాస్‌కు ఆ సినిమా హ‌క్కులు ఇచ్చిన‌ట్టు చెబుతున్నా.. చిరంజీవి మాత్రం రూటు మార్చ‌బోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఖైదీ నుంచి ఖైదీనెంబ‌రు 150 వ‌ర‌కూ అదే మాస్ జోరు. సైరా న‌ర‌సింహారెడ్డితో త‌న డ్రీమ్ ప్రాజెక్టు పూర్తి చేసుకున్నారు. ఆరుప‌దుల వ‌య‌సు దాటినా అదే వేగం.. స్టెప్పుల‌తో మ‌తులు పోగొడుతూ.. ఇప్ప‌టి కుర్ర ‌హీరోల‌తో సై అంటున్నారు. చిరు అంటే కేవ‌లం మాస్‌.. మాస్ కానీ.. మ‌ధ్య‌లో స్వ‌యంకృషి, ఆరాధ‌న‌, అప‌ద్బాంద‌వుడు , రుద్ర‌వీణ వంటి సినిమాల‌తో కొత్త ప్ర‌యోగాలు చేశారు.

సుప్రీం హీరోగా ఉన్న‌పుడే అంత ప్ర‌యోగాలు చేసిన చిరంజీవి ఇప్పుడు మెగాస్టార్‌గా బాలీవుడ్‌, మ‌ళ‌యాళ‌, త‌మిళ హీరోల త‌‌ర‌హాలో వ‌య‌సుకు త‌గిన పాత్ర‌లు.. సామాజిక‌, రాజ‌కీయ సందేశం ఇచ్చేలా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకోబోతున్నార‌ట‌. అంత‌గా తెలుగు సినిమాను ఏలుతూ.. ఇప్పుడు శాసించేంత‌గా ఎదిగారు. ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ‌రావు త‌రువాత తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు పెద్ద‌న్న‌గా మారారు. చిన్న‌, పెద్ద అంటూ తేడాలేకుండా అంద‌రినీ క‌లుపుకుంటూ వెళ్తున్నారు. క‌రోనా విల‌య‌తాండవం చేస్తున్న వేళ లాక్‌డౌన్ విధించారు. సుమారు 20 000 మంది సినీ కార్మికుల కోసం ప్ర‌త్యేకంగా ఛారిటీ ట్ర‌స్ట్ ఏర్పాటు చేశారు. కోట్ల రూపాయ‌లు సేక‌రించి అంద‌రికీ నిత్యావ‌స‌రాలు అంద‌జేశారు.

ఇదే స‌మ‌యంలో కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య తీస్తున్నారు. ఇప్ప‌టికే 80 శాతం సినిమా పూర్త‌యింది. త‌రువాత మ‌రో రెండు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. కుర్ర ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశం ఇస్తామ‌ని చెప్పేశారు. అయితే కొత్త‌గా రాబోయే సినిమాల్లో కేవ‌లం క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ గాకుండా.. పూర్తి భిన్నంగా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ట‌.

You might also like

Leave A Reply

Your email address will not be published.