FbTelugu

పాత నోటిఫికేషన్ ను రద్దు చేయాలి: సోము వీర్రాజు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పాత నోటిఫికేషన్ ను రద్దు చేసి పూర్తి స్థాయిలో ఎన్నికలను నిర్వహించాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థలకు సంబంధించి పాత నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ గతంలోనే తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. తమ విన్నపాన్ని ఎస్ఈసీ పట్టించుకోలేదన్నారు. గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సమయంలో అధికార వైసీపీ దాదాపు 25 శాతం స్థానాలను దౌర్జన్యాలతో కైవసం చేసుకుందని ఆరోపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.