FbTelugu

అంతిమయాత్రలో ముసలిది లేచి కూర్చుకున్నది…!

ముంబయి: కరోనా పాజిటివ్ తో మృతి చెందిందని భావించిన వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఆమెను ఊరేగింపుగా స్మశాన వాటికకు తీసుకువెళ్ల్తండగా లేచి కూర్చోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆశ్చర్యపోయారు.
పెద్దామే బతికిందనే సంతోషంలో అందరూ వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా, ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యుతు తెలపడంతో ఊపిరిపీల్చుకున్నారు.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముధాలే లోని బారామతి గ్రామానికి చెందిన శకుంతల గైక్వాడ్ (76) కు ఈ నెల 10వ తేదీన కరోనా పాజిటివ్ సోకింది. చికిత్స కోసం కారులో హాస్పిటల్ వెళ్లగా మంచం దొరక్కపోవడంతో కారులోనే చాలా సమయం వేచి ఉన్నారు. వేడి గాలి ఉధృతంగా ఉండడంతో శకుంతల అపస్మార స్థితిలోకి వెళ్లింది. శరీరంలో ఏమాత్రం కదలిక లేకపోవడంతో చనిపోయిందని భావించి బంధువులకు సమాచారం ఇచ్చారు.
అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసి, ఊరేగింపు ప్రారంభించారు. పాడెపై ఆమె లేచి కూర్చోవడంతో అందరూ కంగుతిన్నారు. ఈ ఘటనతో బంధవులు, కుటుంబ సభ్యులు షాకయ్యి వెంటనే తేరుకుని హాస్పిటల్ కు తరలించారు. బారామతిలోని సిల్వర్ జుబ్లీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.