FbTelugu

ఓల్డ్ మలక్ పేట రీపోలింగ్ నేడే

హైదరాబాద్: ఇవాళ ఓల్డ్ మలక్ పేట డివిజన్ లో రీపోలింగ్ ప్రారంభమైంది. ఓల్డ్ మలక్ పేటలో గుర్తులు తారుమారు కావడంతో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

ఓల్డ్ మలక్ పేటలో ఆరుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. డివిజన్ పరిధిలో మొత్తం 69 పోలింగ్ స్టేషన్లు ఉండగా.. మొత్తం 54,655 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 27,889 కాగా.. స్త్రీలు 26,763 మంది ఉన్నారు. 12 మంది మైక్రో అబ్జర్వర్ లను నియమించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.