FbTelugu

ఓల్డ్ మలక్ పేట పోలింగ్ రద్దు

హైదరాబాద్: ఓల్డ్ మలక్ పేట డివిజన్ లో పోలింగ్ రద్దు చేశారు. సీపీఐ పార్టీకి చెందిన కంకి కొడవలి గుర్తుకు బదులు సీపీఎం పార్టీ గుర్తు అయిన సుత్తి కొడవలి గుర్తును బ్యాలెట పేపర్ లో ముద్రించారు. దీనిపై ఫిర్యాదు రావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం రద్దు నిర్ణయం తీసుకున్నది.

మళ్లీ పోలింగ్ ఎప్పుడు నిర్వహించేది ఈ రోజు సాయంత్రం ప్రకటించనున్నారు. ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యం వల్ల ఓల్డ్ మలక్ పేట్ లో కంకి కొడవలి గుర్తు బదులుగా సుత్తి కొడవలి ముద్రించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. వెంటనే ఓల్డ్ మలక్ పేట్ లో ఎన్నికలు నిలిపివేయాలని ఆయన అంతకు ముందు డిమాండ్ చేశారు. ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం ఓల్డ్ మలక్ పేటలో పోలింగ్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.