FbTelugu

కనకదుర్గ వారధిపై అయిల్ లీకేజీ

విజయవాడ: కనకదుర్గ వారధి పై ఆయిల్ ట్యాంకర్ వాహనం నుండి డీజిల్ ఆయిల్ లీకైంది. గుంటూరు నుండి విజయవాడ వైపు వస్తున్న లారీ వారధి సమీపం రాగానే రోడ్డుపై లీకవుతున్నది.
ఈ లోపు కొందరు వాహనదారులు అప్రమత్తం చేయడంతో లారీ డ్రైవర్ నిలిపివేశారు.

వెంటనే లారీని నిలిపివేయడంతో వారధి పై ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు లారీని పక్కకు తప్పించి రోడ్డుపై పడిన డీజిల్ ను శుభ్రం చేయించారు.

You might also like