FbTelugu

పెట్రో బాదుడు ఆగలేదు ప్రజలారా!

న్యూఢిల్లీ: రికార్డు స్థాయి ఇంధన ధరలతో జనానికి చమటలు పట్టిస్తుండగా ఇవాళ కూడా ఆయిల్ కంపెనీలు మళ్లీ ధరలు పెంచాయి. వరుసగా మూడు రోజులు ఆగిన కంపెనీలు ఇవాళ పెంచడం గమనార్హం.

దీంతో పెట్రోలు, డీజిల్ ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పెట్రోల్ పై 25 పైసలు, డీజిల్ పై 17 పైసలు పెంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.17, డీజిల్ ధర రూ.81.47కు చేరింది. హైదరాబాద్ లో పెట్రోల్ రూ.94.79, డీజిల్ ధర రూ.88.86 కు పెరిగింది. మిగతా నగరాలు అయిన ముంబయి, చెన్నై, బెంగళూరు, కొలకతాలోనూ కూడా ఇదేరీతిన పెరిగాయి. ఈ నెలలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెంచడంపై వాహనదారులు భగ్గుమంటున్నారు. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు ఉన్నందున ధరలు అమాంతం పెంచి, ఓట్లు వేసే సమయానికి తగ్గించి మాయ చేస్తారని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇప్పటికే కేరళ, పశ్చిమ బెంగాల్ లో కొంత మేర సుంకాన్ని తగ్గించుకుని భారాన్ని తగ్గించాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.