FbTelugu

కలెక్టర్ వైఖరిపై అధికారుల ఆగ్రహం

కొమురం భీం: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దురుసు వైఖరికి నిరసనగా అధికారులు సామూహిక సెలవులకు సిద్ధమైనారు. వివరాల్లోకెళితే.. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జెడ్పీ సీఈఓతో దురుసుగా ప్రవర్తించాడని ఉద్యోగులు తెలిపారు.

ఇలా అధికారుల పట్ల అకారణంగా దూషణకు దిగడం సరికాదంటున్నారు. కలెక్టర్ వైఖరికి నిరసనగా జెడ్పీ సీఈఓ, ఎంపీడీఓ, ఏపీఓలు సామూహిక సెలవులకు సిద్ధమైనారు. ఈ సందర్భంగా వారు జెడ్పీ చైర్మన్ కు వినతిపత్రం ఇచ్చారు.

You might also like